ఎన్టీఆర్‏తో కొరటాల మరోసారి…

174
Jr.Ntr to Act in Koratala Siva's

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో వచ్చిన వరుస సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఆయన ఎన్టీఆర్ తో కలిసి చేసిన ‘జనతా గ్యారేజ్’ బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే చెప్పు కోదగ్గ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు కలిసి బాక్సీఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్దం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

Jr.Ntr to Act in Koratala Siva

ప్రస్తుతం కొరటాల మెగస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సైరా షూటింగ్ పూర్తి అయిన వెంటనే మెగాస్టార్ కొరటాలతో సెట్స్ పైకి వెళ్లనున్నాడట. కొరటాల ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నాడని, చిరంజీవితో సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లానని భావిస్తున్నాడట కొరటాల. ఈ సినిమాకి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. మరోసారి ఈ ఇద్దరు కాంబినేషన్ బాక్సీఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందో లేదో చూడాలి.