ఐఏఎస్ టాపర్‌లను అభినందించిన ఆర్ధిక మంత్రి..

249
Finance Minister Etela Rajender
- Advertisement -

ముగ్గురు ఐఏఎస్ టాపర్ లు తెలంగాణ కు ఆణిముత్యాల లాంటి వారని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటు ఇంత ఘనత సాధించారు. ప్రపంచంలో గొప్పవాళ్ళా చరిత్రను చూస్తే ప్రతి ఒక్కరు ఆకలితో బాధపడిన వారే, దుఃఖమును అనుభవించి వచ్చినవారే. పేదరికం శాపం కాకూడదు, పేదరికమే మీకు స్ఫూర్తి కావాలి దాన్ని అధిగమించి ముందుకు పోతు విజయం సాధించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అప్పట్లో రాళ్లు, పురుగులు ఎరుకొని తినలేక కళ్లలో నీళ్లు తిరిగేవి. కానీ తప్పలేదు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ..గాంధీ జ్ఞాన్ మందిర్ నుండి సచివాలయం వరకు అన్నం కావాలని ర్యాలీ తీసినం .మా ఆరాటం అన్నం కోసం అంతలా ఉండేది అని మంత్రి తెలిపారు.

అన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్రంలో నేను తొలి ఆర్ధిక మంత్రిని అయ్యాను, తొలి సివిల్ సప్లై శాఖకు మంత్రిని అయ్యాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మేధావులతో సచివాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి ఆ మీటింగ్‌లో సన్నబియ్యం పెడదామంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అడ్డుపడ్డాడు. కానీ సీఎం ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచించకుండా సన్నబియ్యంకి అనుమతి ఇచ్చారు. ఐఏఎస్ అధికారులుగా మీరు మరో 30 ఏళ్ళు పనిచేయబోతున్నారు. మీరు ఎక్కడినుండి వచ్చారో అది మర్చిపోవద్దు. మీరు ఈ సమాజం కోసం పని చెయ్యాలి అని ఆయన తెలిపారు.

Finance Minister Etela Rajender

విదేశీ విద్యకోసం పేద పిల్లలకు 20 లక్షల రూపాయలు ప్రకటించిన దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలో 576 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఒక్కో విద్యార్థికి 1లక్ష 5 వేల నుండి 1లక్ష 50 వేలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఢిల్లీకి పోతే చిన్న చూపు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పెరు వినిపిస్తోంది.నేను తెలంగాణ వాడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. అనుదీప్ ది మొదటి ర్యాంక్ తెలంగాణ ది కూడా మొదటి ర్యాంక్. నీళ్లు కోనుకొని త్రాగుతున్నాం, అన్నం కొనుక్కొని తింటున్నాం,ఢిల్లీలో ఊపిరి ఆడడం లేదు అని వింటున్నాం అందుకే ఆ పరిస్థితి మన దగ్గర రాకముందే మొక్కలు నాటే హరితహారం కార్యక్రమంకు పిలుపునిచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

విద్యార్థులకు సూచన చేస్తున్న నీ చేతిలో సైన్స్ ఉంది మీరు ప్రజాహితం కోసం వాడుకోవాలి. మీ హితం కోసం వాడాలి. సెల్ ఫోన్‌లో అమ్మ నాన్నతో మాట్లాడనికి కానీ అమ్మాయిలను వేధించడానికి వాడకండి. యూట్యూబ్‌లో అబ్దుల్ కలాం స్పీచ్‌లు వినండి కానీ అశ్లీల వీడియోలు చూడకండి. మంచిని స్వీకరించి చెడును వదిలి వేయండి. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకొని మీరు గొప్పవాళ్ళు గా ఎదగండి అమ్మ నాన్న కన్న కలలను నిజం చేయండి అని మంత్రి సూచించారు.

నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బీసీ విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో.. సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారికి ఆత్మీయ అభినందన సత్కార సమావేశం ఏర్పాటు ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, బీసీ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన బిసి ఐఏఎస్ టాపర్ లకు సన్మానం చేసిన మంత్రులు. అనుదీప్, సాయితేజ, కృష్ణకాంత్ పటేల్ కు సన్మానం.

Finance Minister Etela Rajender

అనుదీప్ ఐఎఎస్ టాపర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి నా ర్యాంక్ స్ఫూర్తి ని ఇవ్వాలి. నా విజయం నాఒక్కని స్వంతం కాదు ప్రతి విద్యార్థి స్వంతం. నేను 10వ తరగతి వరకు ఊర్లో నే చదివాను .లక్ష్యంతో చదివాను. ర్యాంక్ సాధించాను. రానున్న రోజుల్లో చాలా మంది ఐఏఎస్ టాపర్‌లు వస్తారు .కష్టపడితే సాదించనిది ఏమి ఉండదు. సాయి తేజ ఐఏఎస్ ర్యాంకర్ మాట్లాడుతూ..జీవితంలో ఏది సాధించాలి అనుకుంటే అది సాధించవచ్చు. విజయం దూరంలో లేదు చాలా దగ్గరగా ఉంటుంది కష్టపడితే విజయం సాధించవచ్చు.

జాజుల శ్రీనివాస్ గౌడ్ బిసి విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మాట్లాడుతూ..బిసిలు చదువుకోవడం కోసం గురుకులలు ప్రవేశపెట్టిన ఘనత మన ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో బిసిలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. బిసి కులాల నుండి ఐఎఎస్ లు కావడం చాలా సంతోషం. వీళ్ళను ఆదర్శంగా తీసికొని ముందుకు పోవాలి. బడుగుబలహీన వర్గాల పట్ల మన మంత్రులు పనిచేస్తున్నారు.

Finance Minister Etela Rajender

జోగు రామన్న బిసి సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ..ఐఏఎస్ టాపర్ లకు ప్రభుత్వం తరుపున శుభాభినందనలు. లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే ఫలితం మీదే, ప్రభుత్వ పరంగా అన్నివిధాల సహాయసహకరం అందిస్తాం. మన ముఖ్యమంత్రి కులాల తోటి సంబంధం లేకుండా ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తున్నారు. హాస్టల్‌లో చదివే విద్యార్థులు గతంలో చిన్న చిన్న సమస్యలతో రోడ్ మీద ధర్నాలు చేసేవారు కానీ ఇప్పుడు అలాంటిది ఎక్కడ లేదు. బిసి రెసిడెన్షియల్ స్కూల్ దేశంలో ఎక్కడా లేవు, 119 స్కూల్ లు ప్రారంభించాం. వచ్చే విద్యాసంవత్సరం నుండి మరో 119 స్కూల్స్ ని ప్రారంభిస్తామని సీఎం గారు ప్రకటించారు. విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు అందిస్తున్నాం. స్టడీ సర్కిల్ లు ఉన్నాయి కానీ గతంలో నోటిఫికేషన్ వస్తేనే ఓపెన్ చేసేవారు కానీ ఇప్పుడు 24 గంటలు ఓపెన్ చేసే ఉంటున్నాయి. ఐఏఎస్‌లకు కోచింగ్ ఇస్తున్నాం మీరు కష్టపడి చదవండి మంచి పేరు తేవాలి.

ఎల్ రమణ టిటిడిపి అధ్యక్షుడు మాట్లాడుతూ..దేశంలోనే టాప్ ర్యాంక్‌లు సాధించిన వారు ఇక్కడ ఉండడం విద్యార్థులకు మంచి స్ఫూర్తి. మీ సేవలు దేశానికి అందించి ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా నిలపాలని కోరుకుంటుంన్నాను. చాలా మంది మేధావులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని వచ్చినవారు. నిరంతరం బిసి బిడ్డల కోసం పని చేస్తున్న మంత్రులు జోగు రామన్న, ఈటెల రాజేందర్‌కి కృతజ్ఞతలు

- Advertisement -