అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి..యాక్షన్ డ్రామా

23
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఎమోషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించగా తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది. అనుకోకుండా కొన్ని గొడవల్లో హీరో దిగడంతో తల్లి – కొడుకుల పోరులా ఈ సినిమా తెరకెక్కింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 5.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

అర్జున్ సన్ ఆఫ్ విజయంతి తెలుగు రాష్ట్రాల్లో మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించగా ఎమోషనల్ డ్రామా, తల్లి-కొడుకు సెంటిమెంట్, ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలు మరియు షాకింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్ A నుండి D సెంటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

టికెట్లకు భారీ డిమాండ్ ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు థియేటర్లలో అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.

Also Read:ఏపీ పదోతరగతి ఫలితాలు..వాట్సాప్ ద్వారా!

- Advertisement -