- Advertisement -
ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాల్లో హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అలరించనున్నాడు. ఇటీవల చరణ్, తారక్‌ల గాయాల కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఆర్‌ఆర్‌ఆర్ తిరిగి మొదలు కానుంది.
ఈసందర్భంగా సెట్‌లో ఎన్టీఆర్ సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చారిత్రక కథాంశం కావటంతో గుర్రపు స్వారీలు ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడిని సెట్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.
- Advertisement -