పవన్‌ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..!

162
- Advertisement -

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అజ్ఞాతవాసి రిలీజ్ కి ఇంకా ఒక్క రోజు గ్యాప్ మాత్రమే. ముందు రోజే ప్రీమియర్స్ వేసుకునేందుకు పర్మిషన్ వస్తే కనుక..ఈ రోజు సాయంత్రానికి సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. పవర్ స్టార్ మూవీకి ఫుల్ రేంజ్ లో బజ్ ఉండడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవన్ కల్యాణ్ తాజా చిత్రంకి స్వాగతం పలుకుతూ, అభినందనలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

JR Ntr Fans Hungama at Agnyaathavaasi Movie Theatres

గుంటూరు జిల్లా మాచర్లలోని రామా టాకీస్ లో ‘అజ్ఞాతవాసి’ విడుదలవుతుండగా, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన ప్లెక్సీని ఏర్పాటు చేసి, దానిపై ‘ఆల్ ది బెస్ట్ టూ పవన్ కల్యాణ్… ఫ్రమ్ టౌన్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్’ అంటూ రాశారు. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఇలా ఆదర్శవంతమైన ప్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని పలువురు అభినందించారు. ఇటీవల ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ హాజరై శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -