ఎన్టీఆర్‌ డూప్‌..సోషల్ మీడియాలో వైరల్‌..!

912
ntr doop social media
- Advertisement -

మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. నిజజీవితంలో సంగతి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో మాత్రం డూప్‌లు సహజం. ప్రతి హీరోని అనుకరించేలా డూప్‌లు ఉండటం..వారిని యాక్షన్‌ సీన్స్‌లో నటించేలా చేయడం కామన్‌.

అయితే,రియల్ లైప్‌ అటు ఇటుగా జూనియర్ ఎన్టీఆర్‌ని పోలి ఉన్న ఓ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంజాబ్‌కు చెందిన షమీందర్‌ ఎరోనాటికల్ ఇంజనీర్‌. చూడటానికి సేమ్ టు సేమ్ తారక్‌లానే ఉండటంతో సింగ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో స్పందించిన సింగ్‌ తన పోలికలతో ఓ సూపర్ స్టార్ ఉండటం గర్వంగా అనిపిస్తుందన్నారు. తనకు ఎన్టీఆర్‌ని కలవాలని ఉందని ఓ వీడియో పోస్టు చేశాడు. దీంతో స్పందించిన నెటిజన్లు తారక్‌తో పాటు నిర్మాత మహేష్ కోనేరుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. మరి అతని కోరికను ఎన్టీఆర్‌ నెరవేరుస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.

- Advertisement -