విలన్ గా వివి వినాయక్

176
VV Vinayak

సినిమాల్లో ఈమధ్య హీరోలు మరో హీరో సినిమాలో విలన్ గా కనిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ దర్శకుడు విలన్ గా నటించబోతున్నాడు. మాస్ దర్శకుడు వివి వినాయక్ త్వరలో ఓ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. మంచి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా ఎన్నో హిట్టు సినిమాలను అందిచిన వినాయక్ విలన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు .

శరభ మూవీ దర్శకుడు నరసింహ రావు తెరకెక్కించే ఓ సినిమాలో వినాయక్ విలన్ గా నటించనున్నాడు. ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు చిత్రయూనిట్.