రిజల్ట్స్‌ తర్వాతే ఏ నిర్ణయమైనా:కేసీఆర్‌తో భేటీపై స్టాలిన్‌

260
kcr stalin

రాష్ట్రాల హక్కులు,దేశంలో గుణాత్మక మార్పుకోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగ గంటపాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే వీరి భేటీపై రకరకాల వార్తలు వెలువడుతన్న నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా కేసీఆర్ తన ఆలోచనలను చెప్పారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం తమకు థర్డ్ ఫ్రంట్ ఆలోచన లేదని సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తమిళనాడులో జరిగిన 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్‌కు వివరించారు స్టాలిన్‌. ఇక కాంగ్రెస్‌తో కలసి తమిళనాట ఎన్నికల్ని ఎదుర్కొన్న దృష్ట్యా ఫలితాల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చేలా కేసీఆర్,స్టాలిన్ అభిప్రాయానికి వచ్చారని డీఎంకే నేతలు తెలిపారు.