బ్రేకింగ్..వైసీపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్టీఆర్..!

307
ntr ysrcp
- Advertisement -

ఓ వైపు టీడీపీ -వైసీపీ నేతల మధ్య మాటలయుద్దం నడుస్తుండగా మరోవైపు టీడీపీ నేతలు వైసీపీలోకి క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై మరోసారి ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. తారక్‌ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడంతో జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జూనియర్ వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తారనే వార్త పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే జూనియర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని ఇప్పటికే వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉండగా తాజాగా మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్న పలువురి నేతల దారిలోనే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నడుస్తారని టాక్ నడుస్తోంది. జూనియర్ ఆప్తమిత్రుడైన వంశీ కూడా వైసీపీ గూటికి చేరుతారనే ప్రచారం నడుస్తుండటంతో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో వీరి తరపున ప్రచారం నిర్వహిస్తారని చర్చ జరుగుతోంది.

అయితే జూనియర్‌ వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తారని ప్రచారం జరగడం ఇది తొలిసారి కాదు. హరికృష్ణ బ్రతికున్నప్పుడు తన కుటుంబంతో సహా టీడీపీని వీడుతారని ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి తొందరపాటు అడుగువేయకుండా సేమ్ టైమ్ టీడీపీతో అంటీముట్టనట్టుగా వచ్చారు హరికృష్ణ ఫ్యామిలీ. అయితే 2014లో టీడీపీ ఎమ్మెల్యే కొడాలి ఆని ఆపార్టీని వీడటంలో జూనియర్ హస్తం ఉందనే ప్రచారం జరిగింది.అప్పట్లో ఈ ప్రచారాన్ని తారక్ ఖండించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరడంతో మరోసారి తారక్‌ పొలిటికల్ ఎంట్రీ,వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తారనే వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -