సింగర్ మధుప్రియ… లైఫ్ జర్నీ

979
madhu priya
- Advertisement -

మధుప్రియ.. పరిచయం అక్కర లేని పేరు..తెలంగాణ పాటకు పర్యాయపదంలాంటి పేరు..తన నోటి వెంట పాట పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది..ప్రతీ గుండె గొంతుకను స్పృశిస్తుంది..ఆడపిల్లనమ్మా అంటూ తొమ్మిదేళ్లకే తన పాటల ప్రస్థానం మొదలుపెట్టి…వచ్చిండే మెల్లమెల్లగ వచ్చిండే అంటూ సినీ గీతాలు పాడి టాలీవుడ్ ను ఊర్రూతలూగించే స్థాయికి చేరుకున్న ఈ సూపర్ సింగర్ పెద్దింటి మధుప్రియ ది ఏ ఊరో తెలుసా.. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని.

1997 ఆగస్టు 26వ తేదీన పుట్టిన మధు ప్రియ తల్లిదండ్రులు పెద్దింటి మల్లేష్, సుజాత. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో సంతానం మధు ప్రియ. ఐదో తరగతి చదువుతున్నప్పుడే మధు ప్రియ ఆడపిల్లనమ్మా అనే పాట పాడి అందరినీ షాక్ కు గురి చేసింది.. అంతేకాదు ఆ పాటతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం లా చదువుతున్న మధు ప్రియ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది.. తన పాటలతో ఉద్యమకారులను కదం తొక్కించింది.

18 ఏళ్లకు తన స్నేహితుడు శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది. ఆ విషయంలో కొంత వివాదం నడిచినా ఆ తర్వాత సద్దుమణిగింది.. హైదరాబాద్ నల్లకుంటలో మధు ప్రియ కుటుంబం నివాసం ఉంటుంది.. తన ఇంటి సమీపంలోనే ఉండే శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత వారి ప్రేమ వివాదంగా మారినా.. ఆ తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో ఘనంగా వివాహం జరిగింది.. తెలంగాణ పాటలు..బతుకమ్మ పాటలు.. సినిమా పాటలు.. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్స్ పాడుతూ తెలంగాణలో టాప్ సింగర్ గా ఎదిగిన మధుప్రియకు గ్రేట్ తెలంగాణటీవీ హ్యాట్సాఫ్ చెబుతోంది. ప్రోత్సాహం లభిస్తే ఆడపిల్లలు ఎంతటి ఘన విజయం సాధిస్తారో నిరూపించి ఎంతో మంది గ్రామీణ ఆడపిల్లలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది మధు ప్రియ..

- Advertisement -