మహర్షి-మేజర్‌కు తేడా ఇదే:మహేష్‌

251
mahesh maharshi
- Advertisement -

ఓ వైపు వరుస సినిమాలతో మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్న సూపర్ స్టార్‌ మహేష్ తాజాగా నిర్మాతగా మారారు. ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ రంగంలోకి ప్రవేశించిన మహేష్ తాజాగా ఘట్టమనేని మహేష్ బ్యానర్స్‌(జీఎంబీ)ని స్ధాపించి నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు.

క్షణం, గూఢచారి లాంటి సూపర్‌ హిట్ సినిమాలతో అలరించిన అడవి శేష్‌ హీరోగా ఓ బయోగ్రాఫికల్‌ మూవీని నిర్మిస్తున్నాడు మహేష్‌.ఈ సినిమా గురించి మహేశ్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మేజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్ పాత్రకు అడవిశేష్ సరిపోతారనిపించిందన్నారు.

తాను యాక్టివ్ నిర్మాతను కానని తెలిపిన మహేష్ సినిమాలంటే ప్రాణం అన్నారు. ఏ జోనర్‌కు సంబంధించినవైనా సరే ప్రేక్షకులకు చూపించి తీరాల్సిన కథలు కొన్నుంటాయని వాటిలో ‘మేజర్‌’ ఒకటన్నారు. కొన్నిపాత్రలు తనకు సెట్ కావని అలాంటి మేజర్ సినిమా కథ ఒకటన్నారు. మహర్షి నా హృదయానికి బాగా దగ్గరైందని తన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుందన్నారు.

- Advertisement -