దేశంలో 24 గంటల్లో 31,923 కరోనా కేసులు..

46
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 282 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421కి చేరగా 3,28,15,731 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,01,604 యాక్టివ్ కేసులుండగా 4,46,050 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 71,38,205 మందికి వ్యాక్సినేషన్‌ చేయగా మొత్తంగా 83,39,90,049 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.