ఎన్టీఆర్ కు పోటీగా విశాల్..

211
Jr NTR, Vishal

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా చేస్తున్న‌విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ 40 శాతం చిత్ర‌క‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా హెగ్డె నటిస్తోంది. ఈమూవి కి సంబంధించిన ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ ను ఇటివ‌లే తార‌క్ పుట్టిన రోజున విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి అనూష్య‌మైన స్పంద‌న రావ‌డంతో పుల్ జోష్ లో ఉన్నారు చిత్ర‌యూనిట్. ఈసినిమాకు త‌మ‌న్ సంగీతం అందించ‌గా..హారికా అండ్ హాసిని  క్రియేష‌న్స్  బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్నారు.

aravinda sametha veera raghava

ఈసినిమాలో ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ కుర్రాడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడు . ప‌వ‌ర్ పుల్ బాడీతో మాస్ లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ అభిమానులు. ఈ మూవీని ద‌స‌రాకు విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత రాథాకృష్ణ‌. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ద‌స‌రాకు మ‌రో హీరో సినిమా కూడా రానున్న‌ట్లు తెలుస్తోంది. త‌మిళ హీరో విశాల్ కూడా ద‌స‌రా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్టు స‌మాచారం.

pandemkodi

విశాల్ కు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. గ‌తంలో విశాల్ న‌టించిన పందెంకోడి చిత్రం తెలుగు, త‌మిళ్ లో ఘ‌న విజయం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ఈసినిమాకు సిక్వేల్ ను రూపొందిస్తున్నారు. పందెం కోడి2 పేరుతో ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కూ చిత్రిక‌ర‌ణ పూర్తి చేసుకుంది పందెం కోడి2. ఇక విశాల్ హీరోగా తాజాగా వ‌చ్చిన సినిమా అభిమ‌న్యుడు తెలుగు, త‌మిళ్ లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న స‌మాచారం మేర‌కు అయితే ద‌స‌రా బ‌రిలో ఎన్టీఆర్, విశాల్ మాత్ర‌మే ఉన్నారు..ఇక వీరిద్ద‌రి మ‌ధ్య‌లో ఎవ‌రూ విజ‌యం సాధిస్తారో చూడాలి.