మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పడం లేదు..

777

చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధిస్తున్నారని పలువురు నటీమణులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్యాస్టింగ్ కౌచ్ పై హాలీవుడ్ నటీమణుల నుంచి బాలీవుడ్ నటీమణుల వరకు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

RaviKishan

ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై జోధ్ పూర్ నటుడు రవికిషన్ కూడా ఆరోపణలు చేశారు. చిత్ర పరిశ్రమలో మహిళలకే కాదు మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో మహిళలకే కాదు.. పురుష నటులకు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధలు ఉన్నాయన్నారు.

పురుష నటులను వేధించే హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. అయితే తనకు అలాంటి సంఘటన ఎప్పుడైనా.. ఎదురైందా అనే విషయం మాత్రం ప్రస్తావించలేదు. రవికిషన తెలుగులో కిక్ 2, సుప్రీం, రాధ, లై, రేసు గుర్రం వంటి చిత్రాలలో నటించారు. ఆయన నటించిన రేసు గుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డి క్యారెక్టర్ మంచి గుర్తింపు తీసుకువచ్చింది.