ధనుష్ ఇష్టం.. కమల్‎తో నటించాలి..

231
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో షాలినీ పాండే ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ అమ్మడు వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం షాలినీ తమిళంలో 100% కాదల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఈ అమ్మడు మాత్రం తనకు నచ్చిన కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట.

Shalini Pandey Speak About Dhanu And kamal

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం రెండు భాషలలో అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో 100% కాదల్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నానని.. ఈ చిత్రంతో మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఇక తమిళంలో తనకు ధనుష్ నటన అంటే చాలా ఇష్టమని. ఆయన నటన, డాన్స్, ఫైట్స్ ఎంతో సహజంగా ఉంటాయని. అలాగే కమల్ హాసన్ పట్ల తన అభిమానాన్ని మాటల్లో చెప్పలేనని చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి నటించాలనేది తన కోరిక అంటూ, ఆయనతో నటిస్తే నా అంత అదృష్టవంతులు లేరంటూ చెప్పుకొచ్చారు. కమల్ తో నటించాలనే ఈ అమ్మడు కోరిక ఎప్పుడు నెరవేరవేరుతుందో చూడాలి ఇక.

- Advertisement -