మన దేశంలో ఎక్కువగా పండించే ఆహార పంటలలో జొన్న కూడా ఒకటి. జొన్నలపిండితో చేసే రొట్టెలు దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఒకప్పుడు చపాతీలనే ప్రధాన ఆహారంగా భావించే ఉత్తర భారతీయులు కూడా ఇప్పుడు జొన్నరొట్టెలు తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే జొన్నరొట్టే అత్యంత బలవర్థకమైన ఆహారంగా పరిగణిస్తున్నారు నిపుణులు. జొన్నరొట్టెలను తినే వారిలో కండర బలం, ఎముకల పటుత్వం చాలా మెరుగ్గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే జొన్నరొట్టెలు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నా మాట. జొన్నలలో కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్, పొటాషియం, బి కాంప్లెక్స్ , ఫోలిక్ యాసిడ్.. ఇలా మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయట. .
ఇంకా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా జొన్నరొట్టెలు తింటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుందట. ఇంకా ఇందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది తద్వారా బలహీనంగా ఉన్నవారికి జొన్నరొట్టే మంచి బలాన్నివడానికి సహాయ పడుతుంది. జొన్నరొట్టేలో కొలెస్ట్రాల్ ను పెంచే గుణాలు చాలా తక్కువ అందుకే బరువు తగ్గాలనుకునే వారు జొన్నరొట్టెను ప్రధాన ఆహారంగా ఎంచ్గుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా జొన్నల్లో ఉండే కాల్షియం కారణంగా ఎముకల పటుత్వం పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ జొన్నరొట్టెలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయట. ఇంకా జొన్నల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ కారకాలను దూరం చేయడంలో కూడా ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. కాబట్టి జొన్నరొట్టెలు తినడం వల్ల ఉపయోగాలే ఎక్కువ అని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Also Read:Trending:విందులో చిరు ఫ్యామిలీ