నకిలీ మద్యం కేసులో అరెస్టై 83 రోజుల పాటు జైలులో ఉండి ఇటీవలే విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌తో పాటు రాము కూడా జగన్‌ను కలిశారు.
ఈ భేటీలో జోగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని నెలలుగా వారు ఎదుర్కొన్న కష్టాలపై ఆరా తీసిన జగన్, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షతో పెట్టే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ధీటుగా ఎదుర్కోవాలని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రజల తరఫున పోరాటం చేసిన వారిని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కేసులు పెడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. న్యాయం చివరికి మనవైపే ఉంటుందని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు సాగాలని సూచించారు. జోగి రమేష్ కూడా తనకు అండగా నిలిచినందుకు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:విమాన ప్రమాదాలు..మృతి చెందిన నేతలు వీరే!

