ట్రంప్ కారణంగా మరిన్ని కరోనా మరణాలు:బైడెన్

230
biden
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కారణంగా అమెరికాలో కరోనా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్. ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం, పరివర్తన ప్రక్రియలో సమన్వయం చేయడానికి నిరాకరించడంతో దేశంలో మరిన్ని కొవిడ్‌ మరణాలకు దారి తీయవచ్చని హెచ్చరించారు.

సోమవారం డెలావర్‌లో మీడియాతో మాట్లాడిన బైడెన్….కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం సమన్వయ ప్రణాళికలు రూపొందించాలని, లేదంటే మహమ్మారికి మరింత మంది బలవుతారని డోనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించారు. ఇప్పటి నుంచే వేగంగా టీకా పంపిణీపై సమన్వయం చేయాలని ట్రంప్‌కు సూచించారు.

తాము ఇప్పుడు సమన్వయం చేయకపోతే ఎక్కువ మంది చనిపోతారని, ప్రస్తుతం టీకా ముఖ్యమని, అంత వరకు ఏం చేసినా పెద్దగా ఉపయోగముండదని పేర్కొన్నారు. 300 మిలియన్ల అమెరిక్లకు టీకా పంపిణీ చేయడం పెద్ద పని అని.. ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -