గ్యాస్ గుదిబండ…రూ. 25 పెంపు

49
gas

కరోనా లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండగా పెరుగుతున్న నిత్యావసర,చమురు ధరలకు తోడు గ్యాస్ సిలిండర్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు దేశంలో పలు ప్రాంతాల్లో సెంచరీ మార్క్‌కు చేరుకోగా తాజాగా గ్యాస్ మరింత గుదిబండగా మారుతోంది.

గ్యాస్ కంపెనీలు గ్యాస్ ధరను మరో 25 రూపాయలు పెంచేశాయి. ఈ నెలలోనే మూడు సార్లు సిలిండర్‌ ధరలు పెరగడంతో సామాన్యుడిపై అదనపు భారం పడనుంది. ఈనెల 4న రూ. 25 పెంచగా.. 15న మరో రూ. 50 పెంచాయి. మొత్తంగా మూడు సార్లు గ్యాస్‌ సిలిండర్‌పై రూ.వంద మేర పెంచాయి.