కరోనా రోగులకు కేంద్రం మార్గదర్శకాలివే..

106
home
- Advertisement -

లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారికి సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బారిన పడిన వారిలో లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందడం మంచిదని కేంద్రం సూచించింది.శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు లేనప్పట్టికి, కేవలం జ్వరం, జలుబు, గొంతులో ఇబ్బందులు మాత్రమే ఉండి 94శాతానికి పైగా ఆక్సిజన్ స్థాయి ఉన్నవారు స్వల్ప లక్షణాలు ఉన్నవారి పరిధిలోకి వస్తారు.

కరోనా రోగులకు కేంద్రం మార్గదర్శకాలివే….

() ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న మధ్యస్థాయి/లక్షణాలు లేని వారు రెమ్ డెసివిర్‌ ఔషధాన్ని వాడొద్దు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న రోగులు మాత్రమే దీన్ని తీసుకోవాలి.
()నోటి ద్వారా ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోకూడదు. ఏడు రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం, దగ్గు ఉంటే వైద్యుల సూచనల మేరకే కొంత మోతాదులో వీటిని వాడాలి.
() శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు ఉన్నవాళ్లు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాళ్లు చికిత్స తీసుకోవాలి.
() రోగులు గోరు వెచ్చని నీటిని పుక్కిలించడం చేయాలి. రోజుకు కనీసం రెండుసార్లు ఆవిరి పట్టాలి.
()పారాసిటమాల్‌ 650 ఎంజీ రోజుకు నాలుగు సార్లు వేసుకున్నప్పటికీ, జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
() ఐదు రోజుల పాటు జ్వరం, దగ్గు ఉంటే ఇన్‌హెలేషనల్‌ బ్యూడెసనైడ్‌ (ఇన్‌హేలర్‌ ద్వారా తీసుకునే మందు) ను రోజుకు రెండుసార్లు వైద్యులు సూచించవచ్చు.
() హోంఐసోలేషన్‌లో ఉన్నవారు గదిలో గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. మాస్క్‌ ధరించే ఉండాలి.
() హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇరువురూ ఎన్‌-95 మాస్క్‌ ధరిస్తే మంచిది.
()రోగి వాడిన మాస్క్‌లను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంలో శుద్ధి చేసిన తర్వాతే పారేయాలి.
()కరోనా బారిన పడినవారు వీలైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. శరీరం తేమను కోల్పోకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వారు వినియోగించిన వస్తువులను ఇతరులు వాడొద్దు.
() హోంఐసోలేషన్‌ వ్యవధి పూర్తయిన తర్వాత ఇంకోసారి కరోనా పరీక్షలు అవసరం లేదు.

- Advertisement -