- Advertisement -
చైనాపై ఉక్కుపాదం మోపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. హవాయి కంపెనీతో అమెరికాకు ముప్పు హెచ్చరికపై అలర్ట్ అయిన బైడెన్ ….ట్రంప్ హయాంలో బ్యాన్ చేసిన 5 చైనీస్ కంపెనీలను ‘నేషనల్ సెక్యూరిటీ త్రెట్స్’ లిస్టులో చేర్చింది.
హవాయి, జడ్ టీఈ, హైటెరా కమ్యూనికేషన్స్, హ్యాంగ్జౌ హిక్విజన్ డిజిటల్ టెక్నాలజీ, డహువా టెక్నాలజీ కంపెనీలతో అమెరికా ప్రజలు, జాతీయ భద్రతకు ముప్పు ఉందని వెల్లడించారు. ఈ ఐదు చైనీస్ కంపెనీల డివైస్లను టెలికమ్యూనికేషన్ సర్వీసులను అమెరికన్ కంపెనీలేవీ ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
హవాయి, జడ్ టీఈ కంపెనీల స్థానంలో సొంత ఎక్విప్ మెంట్, నెట్వర్క్లను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికన్ కంపెనీలకు 1.9 బిలియన్ డార్ల ఫండ్స్ ను రిలీజ్ చేసేందుకు కూడా కాంగ్రెస్ గత డిసెంబర్ లోనే ఆమోదం తెలిపింది.
- Advertisement -