కేపీఆర్‌ఐటీలో జాబ్‌ మేళా

775
kprit
- Advertisement -

రోజు రోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగ యువతి, యువకులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నవంబర్ 5న జాబ్ మేళ నిర్వహించనుంది. వివిధ రంగాలకు చెందిన టాప్ కంపెనీలు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఫార్మా, పవర్‌,రిటేల్‌, అగ్రికల్చలర్‌ ,ఇంజనీరింగ్‌,టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌,సివిల్‌, మెకానికల్‌, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్ రంగాలకు చెందిన టాప్ కంపెనీలు ఈ జాబ్ మేళలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ప్రవేశ రుసుం 200 రూపాయలు.

KPRIT

ఘట్‌కేసర్ మండలంలోని ఘనపూర్ గ్రామం కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నవంబర్ 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళ జరగనుంది. హెచ్‌సీఎల్‌,ఇన్ఫోసిస్,ఫ్లిప్ కార్ట్,హెటిరో,కార్వి,స్టార్ స్పిటల్స్, ఐబీఎమ్,విప్రో,ఐసిఐసిఐ,హెచ్‌డీఎఫ్‌సీ లాంటి వివిధ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రిక్రూట్ మెంట్ నిర్వహించనున్నాయి. ఆసక్తికలిగిన నిరుద్యోగ యువతి, యువకులు తమ బయోడేటా, జిరాక్స్ సర్టిఫికేట్స్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో, గుర్తింపు కార్డుతో హాజరుకావాలని కాలేజీ యాజమాన్యం తెలిపింది.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి…వారి తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా..భవిష్యత్‌కు మార్గం చూపుతు విద్యా ప్రమాణాలను పాటిస్తు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి…ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన లెక్చరర్లు,సువిశాలమైన క్యాంపస్‌,ల్యాబ్‌లతో విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది కేపీఆర్‌ఐటీ. ఏఐసీటీఈ అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందింది. ఘట్‌ కేసర్‌ మండలంలోని ఘనపూర్‌ గ్రామంలో విశాలమైన 16 ఎకరాల క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఉప్పల్ బస్ స్టాప్ నుంచి 9 కిమీల, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కేవలం 1 కిలో మీటర్ దూరంలో ఉంది.

KPRIT

అపార అనుభవం గల ప్రొఫెసర్లతో పాటు సుశిక్షితులైన అధ్యాపక బృందం విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ తో విషయ పరిజ్ఞానం అందించేందుకు కృషి చేస్తుంది. నాణ్యమైన విద్యకై ఆధునాతన ప్రయోగశాలలు, డిజిటాల్‌ లైబ్రరీ, సె మినార్‌ హాల్స్‌, స్పోర్ట్‌‌స రూమ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కై ప్ర త్యేక లాబ్‌ను కలిగి ఉంది. విద్యార్థులకు సబ్జెక్టు నాలెడ్జ్‌తో పాటు కమ్యూనికేషన్స్‌ స్కిల్స్ రంగాల్లో శిక్షణ అందిస్తోంది.

KPRIT

- Advertisement -