మొక్కలు నాటిన JNTU మాజీ వైస్ ఛాన్సలర్..

171
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జెడి లక్ష్మీనారాయణ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన కె రాజగోపాల్ మాజీ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని తన తరుపున మరో ఇద్దరికీ పివిఎస్ఎల్ నరసింహ్మ టీ వేవ్ సిఇఓ, గజ్జల సూర్యప్రకాష్ సిఇఓ అర్చమెడిస్ గ్రీన్ ఎనర్జీ పివిటి ఎల్టిడి లను భాగస్వామ్యం కావాలని కోరారు.

- Advertisement -