- Advertisement -
తెలంగాణ గవర్నర్గా ప్రమాణం చేశారు జిష్ణుదేవ్ వర్మ. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు.
2018 నుంచి 2023 వరకూ త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. 1990లో బీజేపీలో చేరారు. ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
Also Read:ఆడియన్స్ కోసమే “బడ్డీ” టికెట్ రేట్లు తగ్గించాం!
- Advertisement -