కస్టమర్లకు జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి సందర్భంగా జియో ధన్ ధనా ధన్ అంటూ రిచార్జ్‌లపై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని ప్రకటించింది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య 399 రూపాయల ధన్ ధనా ధన్ ఫ్లాన్ కి రీఛార్జ్ చేసుకుంటే ఫుల్ క్యాష్ బ్యాక్ రానుంది. క్యాష్ బ్యాక్‌ని ఎనిమిది ఓచర్లగా ఇవ్వనుంది జియో. ఒక్కో ఓచర్ విలువ 50 రూపాయలు. అంటే 400 రూపాయలు విలువైన టాక్ టైం ఇస్తోంది. వీటిని నవంబర్ 15వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు.
రూ.309 ఫ్లాన్ పైన లేదా రూ.91 డేటా యాడ్ ఆన్ ఫ్లాన్ రీఛార్జ్ లో ఈ ఓచర్లను ఉపయోగించుకోవచ్చు. అన్ని ఓచర్లను ఒకేసారి ఉపయోగించుకోవటానికి సాధ్యం కాదు. రీఛార్జ్ చేసుకునే సమయంలో ఒక్కో ఓచర్ ను యాడ్ ఆన్ చేసుకోవాలి. జియో స్టోర్స్, ఆన్ లైన్ ద్వారా ఎక్కడ చేసుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
జియో ప్రవేశపెడుతున్న ప్రతి ఆఫర్‌కి కౌంటర్‌గా ఒక కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది ఎయిర్ టెల్. ఇప్పుడు కొత్తగా పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం మరో ఆఫర్‌ను తీసుకువచ్చింది. రూ.999కే అపరిమిత లోకల్ కాల్స్, 50 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్ పాత, కొత్త పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు వర్తిస్తుంది. ఇప్పటికే ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.999 ప్లాన్ అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటా, అపరిమిత లోకల్ కాల్స్‌ను అందిస్తోంది.
రూ.799 ప్లాన్ పేరుతో 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే. దీంతో పాటు 4జీ వినియోగదారుల కోసం రూ.1,399కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.