కస్టమర్లకు షాకిచ్చిన జియో..

186
Jio Rs. 459 Pack to Replace Rs. 399
- Advertisement -

పండగ పూట రిలయన్స్ జియో కస్టమర్లకు షాకిచ్చింది. ఇప్పటివరకు మిగితా టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన జియో…ఇప్పుడు దివాళికి కస్టమర్లకు షాకిచ్చింది. రోజుకు 1 జీబీ చొప్పున 84 రోజులపాటు ఉచిత డేటాను అందించే ప్లాన్ ధరను పెంచేసేంది. రూ. 399 స్థానంలో గురువారం నుంచి రూ. 459తో రీచార్జ్ చేసుకుంటేనే 84 రోజుల ప్లాన్ మీ సొంతం అవుతుందని తెలిపింది.గతంలో ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు కాగా, తాజాగా దానిని 70 రోజుకు కుదించింది. సవరించిన ప్లాన్లు నేటి నుంచి అమలుకానున్నట్టు జియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.ది.

దివాళీ ధమాకా పేరుతో అందిస్తున్న స్కీమ్‌లో  రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న డేటాను 2జీబీ  నుంచి 4జీబీకు పెంచుతున్నామని పేర్కొంది. అయితే షార్ట్‌ టర్మ్‌ ప్లాన్‌లు, తక్కువ డినామినేషన్‌ రీచార్జ్‌ టారిఫ్‌లను రిలయన్స్‌ జియో తగ్గించింది. వారం వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ రూ.52, రెండు వారాల వ్యాలిడిటీ ఉండే రూ.98 ప్లాన్‌లో ఉచిత వాయిస్, ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చని పేర్కొంది.

రోమింగ్‌లో ఉన్నప్పటికీ, జియో… అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. రూ.509 స్కీమ్‌ ప్రయోజనాలను తగ్గించింది. అంతే కాకుండా బిల్లింగ్‌ సైకిల్‌ను 56 రోజుల నుంచి 49కు కు తగ్గించామని పేర్కొంది. ఇక రూ.999 ప్లాన్‌లో గతంలో ఆఫర్‌ చేసిన 90 జీబీ 4 జీ డేటాను 30 జీబీకి తగ్గించామని తెలిపింది. రూ.1,999 దీర్ఘకాలిక ప్లాన్‌లో గతంలో మూడునెలల కాలపరిమితి ఉండగా ఇప్పుడు దానిని ఆరు నెలలకు పెంచింది.  రూ.4,999 ప్లాన్‌లో గతంలో 210 రోజుల కాలపరిమితి ఉండగా తాజాగా దానిని ఏడాదికి పెంచింది.

- Advertisement -