రెండో పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చేసింది….!

236
Renu Desai once again responds her Second Marriage
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పెళ్లి, విడాకుల తర్వాత రేణు దేశాయ్‌ పుణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకునే రేణు..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. అనారోగ్యం బారిన పడితే తనను చూసుకునేందుకు ఒకరు కావాలని…ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేమని చెప్పుకురాగా సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది.   కొంతమంది పవన్ ఫ్యాన్స్‌ రేణుపై మండిపడగా మరికొంతమంది మద్దతుగా నిలిచారు.

Renu Desai once again responds her Second Marriage

తాజాగా మరోసారి రెండోపెళ్లి చేసుకోవాలని ఉందని మనసులోమాటను బయటపెట్టింది రేణు. ఓ ఛానల్‌లో ప్రసారం అవుతున్న డ్యాన్స్‌ షోకు జడ్జిగా రేణు వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.  ఓ జంట పర్ ఫార్మన్స్ ను చూశాక తనకు ప్రేమపై ప్రేమ పుట్టిందని చెప్పింది.  నాకు ప్రేమ మీద కొంచెం నమ్మకం పోయింది…కానీ మీ అనుబంధం చూసిన తర్వాత ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను…. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటానో అప్పుడు మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానిస్తా  అని రేణూ కన్నీరు పెట్టుకుంటూ ఆ జంటను అభినందించింది.

వచ్చే శని – ఆదివారాల్లో ప్రసారం కాబోతోన్న ఈ షో ప్రొమోను ఆ ఛానల్‌  ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. రేణు దేశాయ్ ప్రేమతో ప్రేమలో పడింది….అంటూ ఆ వీడియోతో పాటు ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ  వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -