రాజుగాడు … ఫస్ట్ లుక్‌

187
Raj Tarun's Raju Gadu firstlook
- Advertisement -

యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌ ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన ‘ఈడోరకం-ఆడోరకం’, ‘కిట్టుఉన్నాడుజాగ్రత్త’, ‘అంధగాడు’ సినిమాతో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌త‌రుణ్ చేస్తోన్న చిత్రం ‘రాజుగాడు’.

దీపావళి సందర్భంగా  ఫస్ట్ లుక్ ను  విడుదల చేసింది చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ రాజ్‌తరుణ్‌ అమైరా దస్తూర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్నట్లు కనిపిస్తుంది.  ఒకరకమైన వింత వ్యాధితో బాధపడుతున్న యువకుడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూపే ప్రయత్నమేనట ఈ సినిమా. ఇందులో హీరో రాజ్‌తరుణ్ తనకు తెలియకుండానే దొంగతనాలకు పాల్పడి ఆ తర్వాత ఇబ్బందులు పడుతుంటాడట.

సంజనా రెడ్డి దర్శకత్వంలో  రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  అమైరా ద‌స్తుర్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు  చేస్తున్నారు.

 Raj Tarun's Raju Gadu firstlook

- Advertisement -