- Advertisement -
భారతీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో వినియోగదారులకు షాకిచ్చింది. డిసెంబర్ 6(రేపు) నుంచి కాలింగ్,డేటా ప్లాన్లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 39 శాతం ఛార్జీలను పెంచింది జియో.
కొత్త ప్లాన్‌లలో జియో నుంచి జియోకు ఫ్రీ కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఇతర నెట్‌వర్క్‌లకు మాత్రం పరిమితంగా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని కల్పించగా కొత్త టారీఫ్ ప్లాన్లను చూసి వినియోగదారులు ఖంగుతింటున్నారు.
ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్లాన్ల చార్జీలను ఈ నెల 3 నుంచి 50 శాతం వరకు పెంచాయి. ఈ రెండు కంపెనీలతో పోలిస్తే జియో ప్లాన్లు చౌకగానే ఉన్నా కస్టమర్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు.
Reliance Jio Infocomm raised its tariffs by nearly 40%, but some of its plans are almost 25% cheaper than those of rivals Bharti Airtel
- Advertisement -