ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్‌రైజర్స్ జట్టు సిద్ధమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక కొత్త లుక్‌తో రాబోతున్నట్టు ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. ఇందులో మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ కొత్త జెర్సీతో ఉన్న వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. దీంట్లో పాత ఆరెంజ్‌కు ఆర్మీ జెర్సీలో సమూలమైన మార్పులు చేయకుండా..సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జెర్సీని పోలినట్టుగా ఆరెంజ్ జెర్సీపై నల్లరంగును అద్దింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2023 సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా రాజస్థాన్‌తో తలపడనున్నది. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్‌కు బాధ్యతలు అప్పగించింది. సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ అందించాడు. కాగా 2022నాటి కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ను వదులుకున్న సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్) హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెరిచ్ క్లాసిన్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, వివ్‌రాంత్ శర్మ, అదిల్ రషీద్, మయాంక్ దగర్, అకీల్ హుస్సేన్, మయాంక్ మర్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్.
ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡
Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi
— SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023
ఇవి కూడా చదవండి…