అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంస్థ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. తన పదవిలో తిరిగి నియమితులైన అనంతరం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ ఆయన పేరును నినదిస్తూ స్వాగతించారు. పలువురు ఉద్యోగులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆఫీస్‌కు చేరుకున్న జెన్సన్ హువాంగ్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మరో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి మరింత మెరుగైన సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. నాకు రెండో అవకాశం ఇచ్చారు. ఈసారి నేను మరింత మెరుగైన సీఈఓగా ఉంటాను అన్నారు. దీంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ ‘వుయ్ లవ్ యూ జెన్సన్’ అంటూ నినాదాలు చేశారు.
ఆ తర్వాత ఉద్యోగుల మధ్య సందడి నెలకొనగా.. ఇది నా మొదటి రోజు పని. నా దగ్గర కంప్యూటర్ కూడా లేదు. ఐటీ విభాగం నాకు కొత్త పీసీ ఇస్తుంది అంటూ జెన్సన్ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న ఉద్యోగులు నవ్వుకున్నారు.
మరో వీడియోలో జెన్సన్ హువాంగ్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. తన వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు విచారం వ్యక్తం చేశారు. తాను కొన్ని తీవ్రమైన తప్పులు చేశానని అంగీకరిస్తూ.. తిరిగి పుంజుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ మహిళా ఉద్యోగి ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ ఘటనతో అక్కడున్న ఉద్యోగులు మరోసారి హర్షధ్వానాలు చేశారు.
Also Read:భోగి..గొప్ప సినిమా: శర్వా
జెన్సన్ హువాంగ్ 2026 నవంబర్ 12న ఎన్విడియా సీఈఓ, ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడి పదవులకు రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత ప్రవర్తన కంపెనీ ప్రవర్తనా నియమావళి, కార్యాలయ ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న ఆందోళనలను అప్పట్లో బోర్డు ప్రస్తావించింది. తాజాగా ఆయనను తిరిగి నియమించడంతో ఎన్విడియాలో నాయకత్వ మార్పుపై నెలకొన్న పరిణామాలకు తెరపడినట్లయింది.

