భోగి..గొప్ప సినిమా: శర్వా

1
- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వా తన ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి’ తో రగ్గడ్, ఇంటెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సినిమాలోని ఆసక్తికరమైన ప్రపంచం, మిస్టరీతో కూడిన సంఘటనలు, వాటిని ఎదుర్కొనే కథానాయకుడి పోరాటాన్ని ట్రైలర్‌లో చూపించారు.

1960వ దశకం ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ట్రైలర్‌లో గంగ పాత్రను పరిచయం చేశారు. తన చెల్లెళ్లతో గంగకు ఎంతో అనుబంధం ఉంటుంది. వారిని సొంత కూతుళ్లలా చూసుకుంటాడు. అయితే ఆ గ్రామం మొత్తం ఒక భూస్వామి ఆధీనంలో ఉంటుంది. అతని అధికారమే గ్రామస్తుల జీవితాలను శాసిస్తుంటుంది. ఆ గ్రామంలో ఒక వింత సంఘటన జరుగుతుంటుంది. ప్రతి అమావాస్య తర్వాత రోజు, సంప్రదాయంగా నిర్వహించే దిష్టి పూజ అనంతరం కొంతమంది యువకులు రహస్యంగా అదృశ్యమవుతుంటారు. అసలు ఆ యువకులు ఎందుకు మాయమవుతున్నారు? గ్రామంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? ఈ పరిస్థితులను గంగ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా కథలో కీలకంగా ఉండబోతోంది.

ఇంటెన్స్ కథలను, భారీ స్థాయి కథనాలను తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంపత్ నంది ఈసారి మిస్టరీ అంశాలతో కూడిన రస్టిక్ డ్రామాను రూపొందించారు. ట్రైలర్‌లో చూపించిన వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టరైజేషన్స్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పైకి కనిపించే కథకు మించి ఇందులో మరిన్ని రహస్యాలు ఉన్నాయనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది.గంగ పాత్రలో శర్వా అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించారు. తన చెల్లెళ్లపై ఎంతో ప్రేమ, బాధ్యత ఉన్న ఒక పల్లెటూరి యువకుడిగా కనిపించారు. అదే సమయంలో తనకు ఎదురైన సవాళ్లను, గ్రామంలో ప్రశాంతతకు ముప్పు కలిగించే పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో ఎంతో వైల్డ్ గా మారుతారు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు మరింత బలాన్ని ఇచ్చాయి.అనుపమ పరమేశ్వరన్ ఆయనకు జోడీగా నటిస్తూ మంచి ఇంపాక్ట్ చూపించారు. డింపుల్ హయతి విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. మిగతా నటీనటుల పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండబోతున్నాయి.

1960ల కాలం నాటి వాతావరణాన్ని కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా చూపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ ఆరోకియా గ్రామీణ వాతావరణాన్ని, కథలోని రా నేచర్‌ను తన విజువల్స్‌తో చక్కగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని టెన్షన్, ఇంటెన్సిటీని మరింత పెంచింది. సస్పెన్స్, రా యాక్షన్, ఊహించని ట్విస్టులతో ‘భోగి’ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన అనుభూతిని ఇవ్వబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ప్రతి సినిమాకీ ఒక టెన్షన్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాకి నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఫస్ట్ కాపీ చూసినప్పుడే ఒక తెలియని సంతృప్తిని ఇచ్చాడు మా సంపత్ నంది. తను కథ చెప్పినప్పుడు నేను చాలాసార్లు టెన్షన్ పడ్డాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఈ భాష నాకు కరెక్ట్‌గా వస్తుందా? నేను చెప్పగలనా? అనిపించింది. ఎందుకంటే ప్రతి భాష ఒక తల్లిలాంటిది. మనం అమ్మతో మాట్లాడినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడతామో, భాష విషయంలో కూడా ఆ గౌరవం మనకు ఉండాలి. ఈ సినిమాలో నా పాత్రతో మీ అందరినీ కన్విన్స్ చేయగలనని అనుకుంటున్నాను. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఒక కథను నమ్మి, శర్వా ఒక నటుడిగా ఈ పాత్ర చేయగలడని బలంగా నమ్మారు మా నిర్మాత. అంత మంచి కథ చేసినందుకు రాధా మోహన్ గారికి థాంక్యూ. ఆయనకు ఎలాంటి కష్టం రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎలాంటి కష్టం వచ్చినా మేమంతా ఆయన వెంట నిలబడతాం. అలాగే డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు ఎక్స్‌ట్రార్డినరీ హార్డ్ వర్క్ చేశారు. 1960లో పరిస్థితులు ఎలా ఉండేవో అచ్చంగా అలాగే చూపించారు. కేకే అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. భీమ్స్‌తో నా జర్నీ నరేష్ గారు చేసిన సినిమాతో మొదలైంది. ఇప్పుడు ‘భోగి’ సినిమాతో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన క్రియేట్ చేసిన పాటలు మామూలుగా ఉండవు. చచ్చిపోయే వరకు గుర్తుండిపోయే పాటలు ఇవి. అంత అద్భుతంగా మ్యూజిక్ చేశారు. అలాగే ఈ సినిమాకి మరో ప్రధాన బలం మా చంద్రబోస్ గారు. ఒక్కొక్క పదం అద్భుతంగా రాశారు. పాటలకు ప్రతిరోజూ లక్షల వ్యూస్ పెరుగుతున్నాయి. ఇది డబ్బు పెట్టి, పుష్ చేసి చేసిన సినిమా కాదు. సినిమా మీద నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను. అనుపమ, డింపుల్‌తో పాటు నా చెల్లెలి పాత్ర చేసిన అమ్మాయి.. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఇమేజ్‌ను పక్కనపెట్టి, కథను నమ్మి చేసిన సినిమా ఇది. సంపత్ నందికి మాస్ మీటర్ బాగా తెలుసు. ఇందులో అందరి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.దిలీప్ గారు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. గుణ్ణం గంగరాజు గారు, దేవా కట్టా గారు, సుజిత్, సంపత్ నంది గారు.. నా కెరీర్‌లో ఈ నలుగురినీ మర్చిపోలేను. ‘భోగి’ సినిమాతో సంపత్ నంది గారు నాలో కొత్త యాంగిల్‌ను ఇండస్ట్రీకి చూపించారు. సంపత్ గారికి థాంక్యూ. ‘భోగి’ గురించి చెప్పాలంటే.. తగ్గినోడికి తగలబెట్టడం కూడా తెలుసు. అనవసరంగా కెలకకండి.. తగలబెట్టి పడేస్తాడు. అందరికీ థాంక్యూ వెరీ మచ్. లవ్ యూ!

Also Read:BB10:నీతూ ఎలిమినేషన్

డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ రిలీజ్ అయిన తర్వాత విష్ చేసిన మాస్ మహారాజా రవితేజ గారికి, గోపీచంద్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ సినిమాను అభినందించారు. వాళ్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. చెడును చంపిన తర్వాత వచ్చే భోగి. బొగ్గులకుంట అనే గ్రామంలో చాలా కాలంగా ఉన్న బానిసత్వాన్ని, కొన్ని నమ్మకాలను మంటలో వేసి కొత్త వెలుగును నింపే క్యారెక్టర్‌లో మా హీరో శర్వానంద్ గారు కనిపిస్తారు. తెలంగాణలోని బొగ్గులకుంట గ్రామంలో జరిగే కథ ఇది. ఈ ప్రపంచమంతా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది.

- Advertisement -