మెగా ఫ్యామిలీని నిలదీస్తే వెలివేస్తారా…?: జీవిత

33
jeevitha

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు సినీ నటి జీవిత రాజశేఖర్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జీవిత…బండ్ల తీరును తప్పుబట్టారు. బండ్ల గణేష్ అంటే నాకు డోంట్ కేర్‌…ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్ అన్నారు.

బండ్ల గణేష్‌ చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారని…తన బతుకు గురించి బండ్ల గణేష్‌కు ఎందుకు? నేను పార్టీలు మారితే మీకు వచ్చిన నష్టం ఏంటి? అని బండ్లను ప్రశ్నించారు. తాను రాజకీయ పార్టీలు మారితే బండ్ల గణేష్‌కు వచ్చిన కష్టమేంటి..? పార్టీలు మారడం అనేది నా ఇష్టం అన్నారు. ఒకే పార్టీలో ఉండి వెనక గోతులు తవ్వితే గొప్పోడా అంటూ ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీని చాలా మంది విమర్శించారు వాళ్లందర్నీ వెలివేస్తారా? అంటూ నిలదీశారు.

వాస్తవానికి తొలుత ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్ నుండి బరిలో ఉంటానని ప్రకటించారు బండ్ల గణేష్. అయితే తర్వాత ప్రకాశ్‌ తన ప్యానల్‌ని ప్రకటించిన సందర్భంగా జీవిత రాజశేఖర్ కూడా తన ప్యానల్ నుండి బరిలో ఉంటారని తెలపగా ఆ ప్యానల్‌ నుండి తప్పుకున్నారు బండ్ల. ఇండిపెండెంట్‌గా జీవితపై పోటీకి దిగుతానని ప్రకటించారు. అంతేగాదు జీవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా జీవిత కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.