నేటితరం యువతి, యువకులు ఫ్యాషన్ గా ఉండడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి చేతిలో ఓ మొబైల్ ఫోన్ ఉంటుంది. నేటి అమ్మాయిలు కూడా జీన్స్ వేసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఆ ఊళ్లో మాత్రం అలాంటి వాటిని నిషేధించారు. అది కేవలం అమ్మాయిలకు మాత్రమే నిషేధం.
అసలు విషయానికి వస్తే హర్యానాలోని సోవిపట్ జిల్లా ఇసాపూర్ ఖేడీ గ్రామ పంచాయితీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ గ్రామంలోని అమ్మాయిలు జీన్స్ వేసుకోరాదని, మొబైల్ ఫోన్స్ వాడరాదని పంచాయితీ పెద్దలు తీర్మాణం జారీ చేశారంట. ఇప్పటికీ ఈ ఊళ్లో ఏం జరిగినా రచ్చ బండలపై తీర్పులు, తీర్మానాలు చేస్తుంటారు. ఒకవైపు అభివృద్ధివైపు దేశమంతా అడుగులు వేస్తుంటే ఆ ఊరు మాత్రం ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది.
మరోవైపు ఈ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా శిక్షలు కూడా వేస్తామని పంచాయితీ పెద్దలు హెచ్చరికలు జారీ చేశారంట. అయితే ఈ విషయం ఆ నోటా ఆ నోటా పాకి మీడియా వరకు చేరడంతో విషయం బయటపడింది. గ్రామ పంచాతీ పెద్దల తీర్పుపై అమ్మాయిలు మండిపడుతున్నారు. జీన్స్ వేసుకుంటే తప్పేంటని, వేసుకునే బట్టల విషయంలో కూడా నిబంధనలు పెట్టడం సరికాదని అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. మగవాళ్లు చూసే విధానంలోనే మార్పు రావాలని అభిప్రాయపడున్నారు.