బీజేపీతో జేడీఎస్ దోస్తీ.. వద్దనుకున్న తప్పలేదా?

25
- Advertisement -

కర్నాటక ఎన్నికల్లో బీజేపీ జేడీఎస్ పార్టీలు ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి కొంత సైలెంట్ గా వ్యవహరించిన ఈ రెండు పార్టీలు.. మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. కానీ ఆ మద్య జరిగిన ఎన్డీయే మిత్రపక్ష కూటమికి హాజరయ్యేందుకు జేడీఎస్ పార్టీకి ఎలాంటి ఆహ్వానం అందక పోవడంతో ఈ రెండు పార్టీల మద్య పొత్తు కష్టమే అని భావించరంతా. దానికి తోడు జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి ఆ టైమ్ లో చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా పొత్తు లేదనే భావనను కలిగించాయి..

ఎన్డీయే సమావేశానికి హాజరయ్యేందుకు తమకేలాంటి ఆహ్వానం అందలేదని, బీజేపీతో కలవాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు మరవక ముందు తాజాగా బీజేపీతో పొత్తు ఉందని చెప్పి అందరిని ఆశ్చర్య పరిచారు కుమారస్వామి. బీజేపీతో పొత్తు కుదుర్చుకునే బాధ్యతను జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ తనకు అప్పగించారని, అని విధాలుగా ఆలోచించి పార్టీ నేతలతో చర్చించి బీజేపీతో పొత్తు నిర్ణయించుకున్నామని కుమారస్వామి స్పష్టం చేశారు.

Also Read:పవన్ క్యారెక్టరే జగన్ టార్గెట్ ?

దీంతో 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు కలిసి బరిలో నిలవనున్నాయని స్పష్టమైంది. కాగా ప్రస్తుతం కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు బరిలోకి దిగితే అసెంబ్లీ ఎన్నిక ఫలితాలే రిపీట్ అయి కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీతో దూరంగా ఉండాలని జేడీఎస్ భావించినప్పటికి తప్పక పొత్తు కుదిర్చుకున్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి కర్నాటకలో కాంగ్రెస్ కు ఎంతవరకు అడ్డుకట్ట వేస్తాయో చూడాలి.

Also Read:‘బేబీ’నా.. ఆమ్మో మాకొద్దూ!

- Advertisement -