మొక్కలు నాటిన జయేష్ రంజన్ IAS..

269
Jayesh Ranjan IAS
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మొక్కలు నాటారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆయన నేడు బయోడైవర్సిటీ పార్క్ సైబరాబాద్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా తను 5 సంవత్సరాల క్రితం నాటిన మొక్క చెట్టుగా మారడంతో దాని వద్ద ఫోటో దిగడం జరిగింది. అదే విధంగా ఈ నెల 25నుండి ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మరొక ముగ్గురికి 1)బీవీఆర్‌ మోహన్ రెడ్డి,చైర్మన్ సెంయింట్‌ 2)బీఎస్‌ మూర్తి ,డైరెక్టర్ ఐఐటీ హైదరాబాద్ 3)సతీష్ రెడ్డి ,డీఆర్ రెడ్డీ లాబ్స్‌ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -