మూడో పెళ్లి పై జయసుధ స్పందన ఇదే

19
- Advertisement -

సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి జయసుధ మూడో పెళ్లి పై ఇప్పటికే ఎన్నో గాసిప్ లు వినిపించాయి. అయితే, తన రెండో భర్త ఆత్మహత్యపై జయసుధ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్త ఆత్మహత్యకు తాను కారణం కాదని ఆమె తెలిపారు. నా భర్త ఆత్మహత్య చేసుకునేంత అప్పులు తమకు లేవన్నారు. కానీ.. కొందరు సోషల్ మీడియాలో తనపై చెడు వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ”ఆయన మరణం తర్వాత షాక్ లో ఉండిపోయా” అని జయసుధ చెప్పారు. నిర్మాతగా జయసుధ భర్తగా నితిన్‌‌ కపూర్‌ కి మంచి పేరు ఉంది. అలాంటి మనిషి ఉన్నట్టు ఉండి ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది.

అయితే, ఆ ఘటనకు తాను బాధ్యురాలిని కాదని జయసుధ చెప్పుకొచ్చింది. జయసుధ మాట్లాడుతూ.. ‘సినిమా వాళ్ల విషయంలో కొందరు తమకు ఏది అనిపిస్తే అది రాసేస్తుంటారు. మాకు అప్పులు లేవు. నా భర్త నితిన్‌ సోదరుడు, వారి బంధువులైన ఇద్దరు మహిళలూ ఆత్మహత్య చేసుకున్నారు. నేను, అత్తగారు కాపాడడానికి ప్రయత్నించి విఫలమయ్యాం. అది నా భర్త కుటుంబానికి ఉన్న శాపం. నా పిల్లలకు ఆ శాపం తగలకుండా ఉండాలాని నేను రోజూ ఆ దేవుడ్ని కోరుకుంటూ ఉంటాను’ అని జయసుధ వ్యాఖ్యానించింది. ఇక తన మూడో పెళ్లి పై కూడా జయసుధ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది.

అయితే, ఇదే విషయం పై నేరుగా జయసుధను సంప్రదిస్తే.. ఆమె ఏం చెప్పారంటే.. ‘ వయసులో ఉన్నప్పుడు ఎవరి తోడు అవసరం లేదు. కానీ, వయసు అయిపోయాక కచ్చితంగా ఓ తోడు కావాలి. అది ఎంతో హాయిని ఇస్తోంది. నా విషయానికి వస్తే.. నాకు అతనికి మధ్య మంచి బంధం ఉంది. అది చెప్పినా అర్థం కాదు. ఇండస్ట్రీలో నిర్మొహమాటంగా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని జయసుధ చెప్పింది. అందుకే కొన్ని విషయాల పై తాను ఇప్పుడు స్పందించకపోవడమే మంచిది అని జయసుధ చెప్పింది.

Also Read:ఆ సినిమాపై మహేష్ క్రేజీ కామెంట్స్

- Advertisement -