న్యూ ఎంట్రీ లా ఉంది:జయప్రద

240
jayapradha
- Advertisement -

ఎ కె ఎస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా.. సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “శరభ”. ఈ చిత్రానికి ఎన్. నరసింహ రావు దర్శకత్వం వహించగా అశ్విన్ కుమార్ సహదేవ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ చాలా గ్యాప్ తరువాత సినిమా చేయాలని ఆశ పుట్టింది అయితే ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నరసింహ ఈ చిత్ర కథతో వచ్చారు కథ విన్నాక తెలిసింది తప్పకుండా విజయం పొందుతుందని అనిపించింది అందుకే అంగీకరించాను.. చెప్పాలంటే ఈ చిత్రం నాకు మళ్లీ న్యూ ఎంట్రీ లా అనిపిస్తోందని తెలిపింది.

నా రీఎంట్రీ కు ఓ మలుపు తిప్పే సినిమా అవుతుందని నమ్ముతున్నా.. ఈ చిత్రంలో నా పాత్ర చాలా వెరీయేషన్స్ లో ఉంటుంది ఓ రకంగా నాకు ఛాలెంజింగ్ పాత్ర. తనకు ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తెలుగులో సినిమా చేస్తే తెలుగు బిడ్డని అనే అనుభూతి కలుగుతుందని జయప్రద చెప్పుకొచ్చారు. దైవానికి-దెయ్యానికి మధ్య జరిగే సంఘర్షణే ‘శరభ’ చిత్ర కథాశమని, పెద్ద స్టార్ కాస్టింగ్‌తో చేసే సినిమాలా పెద్ద బడ్జెట్‌తో నిర్మాత ఈ సినిమాను నిర్మించారని చెప్పారు జయప్రద.

- Advertisement -