బాలయ్య సినిమాలో బీజేపీ నేత..!

284
Balakrishna
- Advertisement -

హీరో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే దానిపై ఆలోచిస్తున్నారు బోయపాటి శ్రీను. ఈ చిత్రానికి ముందుగా ‘మోనార్క్’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘సూపర్ మేన్’, మొనగాడు, డేంజర్, యమ డేంజర్ అనే పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్‌గా బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రానికి BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య కవల సోదరులు పాత్రలో నటిస్తున్నారు. అందులో ఒక క్యారెక్టర్ అఘోరా అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ పాత్ర ఉందని చెబుతున్నారు. ఆ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ జయప్రదను సంప్రదించి సినిమాలో ఆమె పాత్ర గురించి చెప్పారట. వెంటనే జయప్రద ఈ సినిమాలో ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో జయప్రద క్యారెక్టర్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -