టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం..

264
Minister Harish Rao
- Advertisement -

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతల్లో అభివృద్ది కార్యక్రమల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన తొగుటలో రైతువేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం తొగుట తహసీల్దార్ కార్యాలయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు మంత్రి హరీష్.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతులు పాసు పుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని మంత్రి అన్నారు. ఇక నుంచి ప్రతి మండలానికో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెట్టి వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. తెలంగాణ మొత్తం డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మోటర్లు, మీటర్లు కాలకుండా నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి హరీష్ పేర్కొన్నారు.

- Advertisement -