టాలీవుడ్ పాపులర్ యాంకర్, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ‘జయమ్మ పంచాయతీ’ ని విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక సుమ చాలా గ్యాప్ తర్వాత..జయమ్మ పంచాయతీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఎలా చూద్దాం.
కథ:
జయమ్మ (సుమ) తన భర్త (దేవి ప్రసాద్) మరియు పిల్లలతో సంతోషంగా శ్రీకాకుళంలో గడుపుతూ ఉంటుంది. కానీ భర్తకి జబ్బు చేస్తుంది. దీనితో భర్తను చూసుకోవడానికి ఆమెకు డబ్బు అవసరం పడుతుంది. ఆమె తన సమస్యను పరిష్కరించుకోవడానికి గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆమె సమస్య విని అంతా ఆశ్చర్య పడతారు. అదే సమయంలో గ్రామ సభలు మరొక సమస్యను పరిష్కరించడంలో వుంటారు. అయితే మరి ఆఖరికి గ్రామ సభ జయమ్మ సమస్యను పరిష్కరించిందా..?, ఇంకో సమస్య ఏమిటి అనేది కథ.
ప్లస్ పాయింట్స్ :
-సుమ నటన
-కామెడీ సన్నివేశాలు, గ్రామీణ భావోద్వేగాలు
-సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
-సినిమాని సాగతీసినట్టు ఉంటుంది
-బలమైన సంఘర్షణ లేదు
సాంకేతిక విభాగం:
అనుష్క కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మినిమమ్ బడ్జెట్‌తో తీసిన సినిమా అయినప్పటికీ రిచ్ అండ్ క్వాలిటీ విజువల్స్ ఇచ్చాడు. విలేజ్ సెటప్‌ని పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకుని సహజసిద్ధమైన వాతావరణాన్ని తన కెమెరా వర్క్ ద్వారా తెరపైకి తీసుకొచ్చాడు. ఎంఎం కీరవాణి తనదైన ముద్ర వేశారు. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది.
తీర్పు: జయమ్మ పంచాయితి సినిమాని ఒక్క సారి చూడచ్చు.
విడుదల తేదీ:29/04/2022
రేటింగ్ :2.5
నటీనటులు: సుమ కనకళా, దేవి ప్రసాద్ ,దినేష్ కుమార్
నిర్మాతలు: బలగ ప్రకాష్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
దర్శకుడు: విజయ్ కుమార్ కలివరపు