యశోద రిలీజ్ డేట్ ఫిక్స్‌!

103
yashodha
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. విభిన్న తరహా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సామ్…ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యశోద అనే టైటిల్ ఖరారు చేయగా తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌ చేశారు మేకర్స్‌.

శ్రీదేవి మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయడంతో పాటు షూటింగ్‌, రిలీజ్ డేట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు.ఇప్పటికి 80 శాతం షూటింగ్‌ పూర్తయిందని…తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తాం అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌ తర్వాత సమంతకు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌రాజ్‌, శుత్రు మధురిమ, కల్పికా గణేశ్‌, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు కీలక పోషిస్తున్నారు.

- Advertisement -