అయ్యో.. నటి జయలలిత పై అత్యాచారం

55
- Advertisement -

సినీ లోకంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎందరో నటీమణులు తమకు జరిగిన చీకటి అకృత్యాలను వివరించారు. తాజాగా సీనియర్ నటి జయలలిత సంచలన విషయాలు బయటపెట్టారు. మలయాళంలో మొదటి సినిమా చేసేందుకు వెళ్లినప్పడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తనను రేప్ చేశాడని ఆమె చెప్పారు. రేప్ సీన్ గురించి చెబుతా అంటూ రూమ్‌ లోకి తీసుకెళ్లి బలవంతం చేశాడని ఆమె తెలిపారు. తాను ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి తప్పించుకోలేకపోయానంటూ నటి జయలలిత విలపించారు. దాంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో తాను పదిహేను నిముషాలు కోడి పిల్లలా తల్లడిల్లిపోయాను అని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే, తనను బలవంతంగా అనుభవించిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ తర్వాత కేవలం ఆరు నెలల్లోనే చనిపోయాడని, అతనికి ఓ స్త్రీ శాపం తగిలింది అని ఆమె అన్నారు. ఏది ఏమైనా రేప్ సీన్ వివరిస్తానంటూ నటిపై అత్యాచారం చేయడం మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సీనియర్ నటి జయలలిత ఇంకా మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్రసీమలో కూడా నేను చాలా సినిమాలు చేశాను. కానీ, నా ఇష్టం లేకుండా ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఓ సీనియర్ దర్శకుడు మాత్రం అప్పుడప్పుడు కాస్త అసభ్యంగా ప్రవర్తించే వారు.

నిజానికి ఆ దర్శకుడి గురించి చాలామందికి తెలియదు. ఆయన గొప్ప మహానుభావుడు అని కీర్తిస్తూ ఉంటారు. కానీ ఆయనతో నేను ఓ సినిమా చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆయన నన్ను బాగా వేధించే వారు. రాత్రుళ్ళు నిద్ర కూడా ఉండేది కాదు. కానీ సినిమా కోసం నేను చాలా భరించాను. కానీ ఒక్కోసారి అతను మరీ విచ్చలవిడిగా ఉండేవాడు. ఆ విషయంలో నా తప్పు కూడా కొంత ఉంది. అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సి వచ్చింది అని నటి జయలలిత సంచలన ఆరోపణలు చేసింది.

Also Read:కరువుకు స్వస్తి.. ఇకపై కృష్ణమ్మ జల తాండవం!

- Advertisement -