జయలలిత మృతి కేసులో సంచలన విషయం వెల్లడైంది. ఆర్‌కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. .. ఆసుపత్రిలో టీవీ చూస్తున్న జయలలతి వీడియో నకిలీదని తేలింది. జయ మృతిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ విస్తుపోయే నిజాలను వెల్లడించింది.
కమిషన్ కార్యదర్శి కోమల ఆదివారం జయలలిత చికిత్స పొందిన అపోలో ఆస్పత్రికి వెళ్లి వివరాలను సేకరించారు. అమ్మకు చికిత్స అందించిన రూమ్‌ను పరిశీలించారు. జయలలిత జ్యూస్ తాగుతూ టీవీ చూసే అవకాశమే లేదని తెలిపింది.
జయ పడుకున్న మంచానికి ఎదురుగా ద్వారం ఉందని…మంచానికి ఎదురుగా ఉన్న గోడకు టీవీ అమర్చే అవకాశమే లేదని ఆమె గుర్తించారు. దీంతో ఆ వీడియో నకిలీదని తేలిందని కోమల తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో బయటికి రావడం.. ఆర్కేనగర్ ఉపఎన్నికలో జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
గతేడాది సెప్టెంబర్ 22న జయలలిత అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపొల్లో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచే వరకు 75 రోజుల పాటు అక్కడే ఆమె చికిత్స పొందారు.