అతి పిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికైన మహిళ..!

662
Mayor Mekala Kavya
- Advertisement -

ఇటీవల జరిగిన తెలంగాణ మున్పిపల్‌ ఎన్నికలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌‌కి చెందిన ఓ మహిళ మేయర్‌గా ఎన్నికైన రికార్డు సాధించింది. మేయర్‌గా గెలవడం రికార్డు ఏముంది అనుకుంటున్నారా..? ఎందుకంటే మేయర్ అయిన అతి పిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. కేవలం 26 ఏళ్ల వయసుకే కార్పొరేషన్‌ తొలి మేయర్‌గా ఎన్నికై మేకల కావ్య రికార్డు సృష్టించారు.

jawahar-nagar-corporation-mayor-mekala-kavya

ఇక వివరాల్లోకి వెళ్లితే.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు తొలిసారిగా జరిగిన ఎన్నికలో 28 డివిజన్లకు ఏకంగా 20 డివిజన్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 15వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన మేకల కావ్య కార్పొరేషన్‌లోనే 900కు పైగా ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించారు. మేకల కావ్య. ఆమె ఏకంగా మేయర్‌ పదవితోనే తన రాజకీయల్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.

కావ్య మారేడ్‌పల్లి నారాయణ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈసీఐఎల్‌ నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో 2016లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సు పూర్తి చేశారు. 2017 మార్చి 16న ప్రవీణ్‌ను వివాహం చేసుకున్నారు. రెండేళ్ల కుమార్తె ధాన్వితో కలిసి కార్పొరేషన్‌ పరిధిలోని 15వ డివిజన్‌లో నివసిస్తున్నారు. కావ్య భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప‌ని చేస్తున్నారు.

- Advertisement -