- Advertisement -
భారతీయ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీంది జాన్వీ కపూర్. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకుసాగుతున్న ఈ భామ…ప్రస్తుతం తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన కోలమావు కోకిల చిత్రం హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక చాలాకాలంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు. అలాగే తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉందన్నారు.
- Advertisement -