ఎన్టీఆర్ ముందు హైలైట్ అవ్వడం అంటే గొప్పే

39
- Advertisement -

‘దేవర’ ఈ టైటిల్ వినడానికి చాలా వినసొంపుగా ఉంది. పైగా ఈ సినిమా కోసం కొరటాల శివ తన శక్తిని అంతా ధారపోసి సినిమా చేస్తున్నాడు. కాబట్టి.. ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తన ఇమేజ్ తో పాటు తన పైత్యాన్ని కూడా పక్కన పెట్టి.. కొరటాల శివ ఈ సినిమా కోసం కిందామీదా పడుతున్నాడు. ఎప్పుడూ లేనిది ఈ సినిమాకి మరో ఇద్దరు రచయితలను పెట్టుకున్నాడు. పైగా తన సినీ కెరీర్ లోనే కొరటాల శివ ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రతలు, అలాగే ఈ సినిమా కోసం పడినంత తపన మరే సినిమాకి పడలేదట.

అంతగా తపించిపోతూ చేస్తోన్న సినిమా కాబట్టి.. తన ఆచార్య ప్లాప్ కు బ్రేక్ పడుతుందనేది కొరటాల శివ ఆశ. పైగా ఇప్పటికే కెరీర్ పరంగా కూడా బాగా వెనకపడిపోయాడు. చాలా గ్యాప్ తీసుకుని దేవర చేస్తున్నాడు కాబట్టి, ఎన్టీఆర్ తో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం కీ రోల్స్ లో జాన్వీ కపూర్ ను, సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేసుకున్నాడు. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చాలా బలమైనదట.

పైగా కొరటాల శివ ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మొత్తానికి పాత్ర బలంగా ఉండటంతో జాన్వీ కపూర్ నటన కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుందని.. సినిమా మొత్తంలో జాన్వీ కపూర్ బాగా హైలైట్ అవుతుందని ఈ చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. అయినా, ఎన్టీఆర్ నటన ముందు జాన్వీ కపూర్ హైలైట్ అవ్వడం అంటే గొప్ప విషయమే.

Also Read:Posani:నేను చనిపోతే ఆపని చేయకండి

- Advertisement -