ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ మొదలు..

31
- Advertisement -

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు పవన్.పోలీస్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్, అతని క్లోజ్ ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఇద్దరు సెట్స్ లో నడుస్తుండగా తీసిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. దాదాపు ఒక వారం రోజుల పాటు ఉస్తాద్ షూటింగ్ షెడ్యూల్ ఉండొచ్చని సమాచారం.

ఇటీవలే బ్రో సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు పవన్. పవన్ చేతిలో ఇప్పుడు OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఎలక్షన్స్ లోపు ఈ సినిమా షూటింగ్స్ పూర్తిచేయాలని చూస్తున్నారు పవన్. ఏదిఏమైనా ఉస్తాద్ భగత్‌సింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:బీఆర్ఎస్‌ ఫస్ట్ లిస్ట్…సర్వత్రా ఉత్కంఠ

- Advertisement -