జనగామలో రైతుల భారీర్యాలీ..

132
mla muthiredy

సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జనగామ పట్టణంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సీఎం కెసిఆర్ తీస్కొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం తో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.

నూతన రెవెన్యూ చట్టంతో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం….పేద రైతులకు భరోసా.సీఎం కెసిఆర్ 7ఏండ్ల పాలనా లో రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేసిండని తెలిపారు.సీఎం కెసిఆర్ చేపట్టిన కార్యక్రమాలతో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.

తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను అనేక రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి..స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని పార్లమెంట్ లో అభినందించారని చెప్పారు.

నూతన రెవెన్యు చట్టంతో రైతుల కు వరం లాంటిదన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.కేంద్రం తీసుకోచ్చిన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట శాపం లా ఉంది. మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ బిల్లు, విద్యుత్ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ టీఆర్ఎస్ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.