తెలంగాణలో జనసేన పోటీ

9
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి సాగర్. ఆయన నటించిన ది 100 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సాగర్…తెలంగాణలో జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చారు.

అయితే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేనని చెప్పారు. పోటీ చేయకున్న రాజకీయాల్లో మాత్రం ఉంటానని.. అయినా తన పోటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటాడని చెప్పారు.

Also Read:ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ

తెలంగాణలో జనసేన ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. ఇవేమి నేను కోరుకోలేదు. వచ్చిన బాధ్యతలు తీసుకుంటున్నాను. అవకాశం వస్తే చేస్తాను అని తెలిపారు. ఆర్కే సాగర్ గోదావరిఖని, రామగుండం ప్రాంతానికి చెందిన వాడు కావడంతో రామగుండం నుండి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -